రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై.. !

-

ఆర్బిఐ 2వేల రూపాయల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే.  అయితే.. రేపటి తో 2వేల రూపాయల నోటు చెల్లుబాటు ముగియనుంది. ఈ నెల 30వ తేదీ వరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటు మార్పిడి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోటును బ్యాంకుల్లో జమ చేయడానికి రేపటి వరకు మాత్రమే సమయం ఉంది.

ఇప్పటికే కోట్ల కొద్ది డబ్బులు బ్యాంకుల్లో అనేకమంది జమ చేశారు. రేపు చివరి తేది కావడంతో ఈరోజు, రేపు బ్యాంకుల్లో 2000 నోటు జమ చేయడానికి అత్యధిక మంది వస్తారని బ్యాంకు సిబ్బంది అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2016లో నవంబర్ 8న వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి నల్లధనాన్ని అరికట్టేందుకే ఈ రెండు వేల రూపాయలను ప్రవేశపెట్టినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news