AP : వినాయక ఊరేగింపులో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు

-

AP : ఏపీలోని వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ పద్మనాభం మండలం మద్ది లో పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు బయట పడ్డాయి. వినాయక ఊరేగింపు లో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు చేస్తూ దర్శనం ఇచ్చారు.

AP : వినాయక ఊరేగింపులో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు

అసభ్యకర నృత్యాలపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ నిర్వాహకుల తీరుపై పోలీసుల వ్యవహార శైలిపై మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. కాగా, హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద మైనర్ యువకుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు గణనాథుని తీసుకొని వస్తున్న లారీ టైర్ కింద పడి మృతి చెందాడు యువకుడు. చనిపోయిన మైనర్‌ బాలుడు కిషన్‌భాగ్ కు చెందిన ప్రణీత్ కుమార్ గా గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news