తెలంగాణ రాష్ట్ర హోంగార్డులకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు చేసింది పోలీస్ శాఖ. ఏకంగా 15 మంది హోంగార్డులకు నోటీసులు ఇచ్చింది పోలీస్ శాఖ. రవీందర్ ఆత్మహత్య కు నిరసనగా ఆందోళన చేసిన హోంగార్డులకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు చేసింది పోలీస్ శాఖ. అయితే.. దీనిపై హోంగార్డులు స్పందించారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేసిన వారిపై కక్ష సాధింపు అంటున్నారు హోంగార్డులు.
అటు నోటీసులు ఇవ్వడం పై హోంగార్డుల సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, గోషామహల్ కమాండెంట్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు రవీందర్ అనే హోంగార్డు. అయితే.. చికిత్స పొందుతూ మృతి చెందాడు హోంగార్డు రవీందర్. కాగా… రవీందర్ మృతికి కారణమంటూ ఎస్ ఐ , కానిస్టేబుల్ పై ఆరోపణలు చేశారు రవీందర్ భార్య. ఈ తరుణంలోనే… రవీందర్ భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు. ఇక హామీ నేరవేర్చకుండా క్షక్ష సాధింపు చర్యలకు దిగడం పై ఆగ్రహం చేస్తున్నారు హోంగార్డులు.