బండారు సత్యనారాయణను అరెస్టు.. సినీ రచయిత సెటైర్లు

-

టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.

మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, సీఎం జగన్, మంత్రి రోజాపై వివాదాస్పద వాక్యాలు చేయడంతో టిడిపి నేత బండారు సత్యనారాయణను అరెస్టు చేసిన  క్రమంలో సినీ రచయిత బివిఎస్ రవి ట్వీట్స్ చేశారు. ‘ఈ అరెస్టు నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే… మైకు దొరికింది కదా అని నోటికి వచ్చింది. పిచ్చిపిచ్చిగా వాగేయకూడదు’ అని పేర్కొన్నారు. దీంతో BVS రవి TDP నేతలను ఉద్దేశించే ఈ వాక్యాలు చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news