బాలీవుడ్ రామాయణంలో సీతగా సాయిపల్లవి?

-

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటికే రామాయణం గురించి చాలా సినిమాలు వచ్చాయి. తెలిసిన కథే అయినా ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సీతారాముల కథను చెప్పారు. ఇక ఇటీవలే ఆదిపురుష్​ మూవీ కూడా రామాయణం బ్యాక్​గ్రౌండ్​తోనే వచ్చింది. అయితే ఇప్పుడు రామాయణంపై  తెరకెక్కనున్న మరో సినిమా గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్​ దర్శకుడు నితేశ్​ తివారీ రామాయణంపై సినిమా తీయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాముడు, సీత, రావణుడి పాత్రలో ఏయే తారలు కనిపించనున్నారంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓ జాబితా నెట్టింట వైరల్ అవుతోంది కూడా. అయితే ఇంతకముందు సీతారాములుగా ఆలియా-రణ్​బీర్, రావణుడిగా కేజీయఎఫ్ యశ్ పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా స్థానంలో టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు రావణుడిగా హీరో యశ్​ పేరు కన్ఫామ్ అయినా.. ఆ తర్వాత ఆయన ఈ సినిమా చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రావణాసురుడిగా నటించేందుకు తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Read more RELATED
Recommended to you

Latest news