అల్పాహార నాణ్యతను ప్రతిరోజు పరిశీలిస్తాం : కేటీఆర్

-

తెలంగాణలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు వడ్డించే అల్పాహారాన్ని పరిశీలించి వారికి స్వయంగా వడ్డించారు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్. రావిర్యాల సర్కారు బడిలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం హరీశ్ రావు విద్యార్థులకు టిఫిన్ తినిపించారు.

మరోవైపు వెస్ట్​మారేడ్​పల్లిలో బ్రేక్​ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం మాట్లాడాతు.. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్రప్రభుత్వం చర్యలుచేపట్టిందని తెలిపారు. విద్యారంగం బలోపేతానికి ఎన్నో  వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు. అల్పాహార పథకం పేద పిల్లలకు వరమన్న మంత్రి కేటీఆర్.. మఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పథకం ప్రారంభించినా దానివెనక ఓ మానవీయ కోణం ఉందని పునరుద్ఘాటించారు.

‘రాష్ట్రంలో 20 ఏడువేల 147 పాఠశాలల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించుకోవడం చాలా అదృష్టం. నాణ్యమైన అల్పాహారం సరైన అల్పాహారం పెడితే బాగుంటుందని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నాం. నాణ్యమైన పోషక పదార్థాలు కలిగిన అల్పాహారం అందిస్తున్నాం ప్రతిరోజు భిన్నంగా అల్పాహారం ఉంటుంది.’ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news