బాలయ్య “భగవంత్ కేసరి” ట్రైలర్ విడుదల… !

-

టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా మరియు మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల లు హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కాసేపటి క్రితమే వరంగల్ లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే బాలకృష్ణ అక్టోబర్ 19వ తేదీన థియేటర్ లలోకి గ్రాండ్ గా రానున్నారు.

మరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందిస్తున్న అనిల్ రావిపూడి బాలయ్యకు కూడా హిట్ ను అందించి మరో మెట్టు ఎక్కుతాడా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news