టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా ఓ వేదికపై కంటతడి పెట్టింది. తన లైఫ్‌లో మిస్ అయిన అనుభూతిని నందమూరి బాలకృష్ణ ఫీల్ అయ్యేలా చేశారంటూ ఎమోషనల్ అయింది. బాలయ్య హీరోగా.. కాజల్ హీరోయిన్గా.. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ట్రైలర్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ట్రైలర్లో బాలయ్యతో పాటు శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బాలయ్య ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించారో.. శ్రీలీల అంతే ఎనర్జీతో పాటు ఎమోషనల్‌గా కనిపించింది. సినిమాలో ‘విజ్జి పాప’గా శ్రీలీల కనిపించింది.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ ఎమోషనల్ అవతూ.. స్టేజ్‌పైనే లైట్‌గా కన్నీళ్లు పెట్టుకుంది. షూటింగ్ సమయంలో చిత్రబృందంతో తనకు ఏర్పడిన బంధం గురించి గుర్తుచేసుకుంది. మూవీ టీమ్‌కు ధన్యవాదాలు చెబుతూ.. ఈ సినిమాలో సోల్ కనెక్ట్ అ్యయే క్యారెక్టర్‌కి ఇచ్చిన అనిల్ రావిపూడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. విజ్జి పాత్రకు తాను చాలా బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని.. ఈ పాత్ర చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. సినిమా లాస్ట్ సీన్ కట్ చెప్పాక అందులో నుంచి బయటకు రాలేకపోయానని.. తన లైఫ్‌లో ఏ అనుభూతిని అయితే పొందలేదో ఆ అనుభూతిని ఈ సినిమా ద్వారా బాలయ్య బాబు అందించారని శ్రీలీల ఎమోషనల్ అయింది.