ఆ సమయంలో ప్రభుత్వాలు మాకు సహకరించలేదు : బాలకృష్ణ

-

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఆదివారం రోజున వరంగల్​లో అట్టహాసంగా జరిగింది. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్​లో మాట్లాడిన బాలకృష్ణ.. తాను హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా విడుదల విషయంలో ప్రభుత్వాలు సహకరించలేదని అన్నారు. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ ఉన్న సమయంలో ‘అఖండ’ను విడుదల చేశామని చెప్పారు. ఆ సమయంలో ప్రభుత్వాలు తమకు సహకరించలేదని.. అదనపు షోలు లేవని, టికెట్‌ రేట్లు పెంచలేదని చెప్పారు. ప్రేక్షకులు తరలి రావడంతో.. ఆ సినిమా రికార్డు సృష్టించిందని వెల్లడించారు. పారిశ్రామిక రంగాన్ని ఎలా గుర్తిస్తారో చిత్ర పరిశ్రమను ప్రభుత్వాలు అలాగే గుర్తించాలని.. అప్పుడే ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తుంది అని బాలయ్య బాబు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news