డిసెంబర్ మొదటి వారంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ?

-

డిసెంబర్ మొదటి వారంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే ఛాన్స్‌ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 2018 లో లాగా, చత్తీస్ ఘడ్ మినహాయించి మిగిలిన నాలుగు రాష్ట్రాలు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం లలో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నవంబర్ రెండవ వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Election schedule released today
Election schedule released today

డిసెంబర్ 10 నుంచి 15 తేదీల మధ్య ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మిజోరం లో “మిజో నేషనల్ ఫ్రంట్” అధికారంలో ఉండగా, డిసెంబర్ 17 వ తేదీతో ముగియనుంది అసెంబ్లీ పదవీ కాలం. వచ్చే ఏడాది జనవరిలో మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, మధ్య ప్రదేశ్ లో బిజేపి,, తెలంగాణ లో బీఆర్ఎస్, మిజోరం లో “మిజో నేషనల్ ఫ్రంట్” అధికారంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news