చైనా కుట్ర.. నిజ్జర్ హత్యలో డ్రాగన్ ఏజెంట్లు.. ఇండియన్ ఇంగ్లీష్ నేర్చుకుని మరీ!

-

ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్యలో భారత్​పై కెనడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే నిజ్జర్ హత్య కేసులో ఇప్పుడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యలో చైనా కుట్ర ఉన్నట్లు బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్​ పార్టీ (సీసీపీ) ఏజెంట్ల ప్రేమయం ఉందని స్వతంత్ర బ్లాగర్​ జెన్నిఫర్​ జెంగ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కెనడా, భారత్​ మధ్య విబేధాలు సృష్టించడమే చైనా ఉద్దేశమని.. తైవాన్​ విషయంలో చైనా సైనిక వ్యూహానికి అనుగుణంగా ప్రపంచ దేశాల దృష్టి మళ్లించే పథకంలో ఇది భాగమని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న జెన్నిఫర్.. తాజాగా తన సోషల్​ మీడియా ఎక్స్​(ట్విటర్​)లో వీడియో పోస్ట్​ చేశారు. అందులో నిజ్జర్​ది హత్యనేని.. ఈ హత్యలో సీసీపీ ఏజెంట్ల ప్రేమయం ఉందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news