వై ఏపీ నీడ్స్ జగన్ అనే పేరుతో అధికార వైసీపీ క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయినింగ్ కి కౌంటర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది టీడీపీ. ఏపీ హేట్స్ జగన్ పేరుతో జగన్ కి కౌంటర్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా జగన్ ను ఏపీ ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయానికి వచ్చినట్టు.. సోషల్ మీడియాలో కూా ఏపీ హేట్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆన్ లైన్ ప్లాట్ ఫాంస్ పై ప్రచారం చేపట్టనున్న టీడీపీ ప్రకటించింది.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మీడియాతో మాట్లాారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు.. ఏపీ హేట్స్ జగన్ అని పేర్కొన్నారు. వైసీపీ ప్రతినిధుల సభలో జగన్ మాట్లాడిన ప్రతిదీ పచ్చి అబద్దం అన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్.. మూడు రాజధానులు కడతారా..? నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10-15 మందికి మాత్రమే దక్కాయి. రూ. 10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులేమయ్యాయి..? రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను డీబీటీల రూపంలో ఇచ్చానని చెబుతున్నారు.. మిగిలిన రూ. 7 లక్షల కోట్లపై నిధులేమయ్యాయి..? రూ. 7 లక్షల కోట్ల నిధులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. వైద్య, విద్య రంగాలను జగన్ సర్వనాశనం చేశారు. అన్ని నాశనం చేసిన జగన్ ఇంకెందుకని అడుగుతున్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు అడ్డుకుంటున్నారని.. బస్సు యాత్ర చేస్తున్నారా..? దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్న జగన్.. దళిత పక్షపాతా..? అని ప్రశ్నించారు.