ఈ రోజు వరల్డ్ కప్ లో డబుల్ హెడర్ లో భాగంగా రెండవ మ్యాచ్ లో శ్రీలంక మరియు పాకిస్తాన్ లు హైదరాబాద్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది… కెప్టెన్ నిర్ణయానికి తగినట్లుగానే శ్రీలంక ధీటుగా ఆడుతోంది. ఓపెనర్లలో కుషాల్ పెరీరా డక్ అవుట్ గా వెనుతిరిగా మెండిస్ తో కలిసి నిస్సంక శ్రీలంక ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 102 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిస్సంక అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాక అనవసర షాట్ కు ప్రయత్నించి షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మెండిస్ పాక్ బౌలర్లను ఏమాత్రం కనికరం లేకుండా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
మెండిస్ కేవలం 77 బంతుల్లో 14 ఫోర్లు మరియు 6 సిక్సులతో 122 పరుగులు చేసి హాసన్ అలీ బౌలింగ్ లో ధాటిగా ఆడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.