ఐపీఎల్ 2023 మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర గొడవ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లక్నో వర్సెస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ హక్ ఇద్దరు గొడవపడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు వీరి మధ్య సోషల్ మీడియా వేదికగా కూడా వివాదం రాజుకుంది.
అయితే నిన్న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంలో వీరిద్దరూ కలిసిపోయారు. తమ వైరానికి పుల్ స్టాప్ పెట్టి… ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.కాగా ఆఫ్ఘన్ విధించిన 273 పరుగుల విజయ లక్ష్యాన్ని 15 ఓవర్ల ముందే భారత్ చేదించింది. తొలుత లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక సెంచరీతో భారత్ విజయానికి బాటలు వేశాడు. రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు.
https://x.com/Kohli_Devotee_/status/1712298775916769323?s=20