ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య పోరు భీకరంగా సాగుతోంది. రోజురోజుకు ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న దాదాపు 18 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలపై కేంద్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ అజయ్‌ను మొదలుపెట్టి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. జై శంకర్ ప్రకటనతో ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ.. రిజిస్టర్ చేసుకున్న భారతీయులకు ఈ-మెయిళ్లను పంపి.. మిగతా వారికి ఆ తర్వాత వచ్చే విమానాల్లో తరలిస్తామని తెలిపింది.
ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసర సహాయక కేంద్రాలను(హెల్ప్‌లైన్) దిల్లీ, టెల్అవీవ్, రమల్లాలో ఏర్పాటు చేసింది.
దిల్లీ కంట్రోల్ రూం నంబర్లు, ఈ మెయిల్ చిరునామా వివరాలు..
1800118797 (టోల్‌ఫ్రీ),
+91-11-23012113,
+91-11-23014104,
+911123017905,
+919968291988,
భారత రాయబార కార్యాలయాలు టెల్ అవీవ్, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ వివరాలు
+97235226748,
+972543278392,
+970592916418 (వాట్సాప్ కూడా),