అఫ్గానిస్థాన్‌ను పట్టిపీడిస్తున్న భూకంపాలు.. మూడోసారి ప్రకంపనలు!

-

అఫ్గానిస్థాన్‌ దేశాన్ని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. ఇటీవలే చోటుచేసుకున్న భూకంపాల్లో వేల మంది మృత్యువాత చెందారు. ఆ విషాదం మరవక ముందే తాజాగా మరోసారి అక్కడ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపంలో ఒకరు మృతి చెందారని సమాచారం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెల 7వ తేదీన హెరాత్‌ ప్రావిన్స్‌లో వచ్చిన భూకంపానికి ఇప్పటికే 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిందని నిపుణులు తెలిపారు. ఈ భూకంపంలో చనిపోయిన వారిలో 90శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారని అఫ్గాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం ఉన్న జెండాజెన్‌ జిల్లాలో 1,200 మందికిపైగా మరణించారని.. ఇక 11వ తేదీన మరోసారి 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపంలో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news