ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. గాజాపై ఇజ్రాయెల్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. గాజాను అష్టదిగ్బంధనం చేసి హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రతిన పూనింది. గాజాలో సంక్షోభం వేళ ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు తెలిపిన అమెరికా తాజాగా మరో విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రంలో మోహరించింది.
మరోవైపు టెల్‌అవీవ్‌కు అమెరికా పూర్తి మద్దతు తెలుపుతూ.. అగ్రరాజ్యం నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం అందుతోంది. ఇజ్రాయెల్-హమాస్ పోరులో మూడో దేశం జోక్యం చేసుకోకుండా అరికట్టేందుకు ఈ నౌకను అమెరికా పంపినట్లు శ్వేతసౌధం తెలిపింది. యూఎస్ఎస్ ఐసన్‌హోవర్ తన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌తో ఇజ్రాయెల్ తీరానికి తరలించినట్లు వెల్లడించింది. ఇప్పటికే అక్కడ ఉన్న ద యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌక బృందంతో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ గ్రూప్‌లో డిస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు, ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. మరోవైపు హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరులో ఇరువైపుల దాదాపు 3,500 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతిదాడిలో 2,200 మందికి పైగా గాజా పౌరులు మృతి చెందారు.