పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆఫ్రిది చెల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే తన చెల్లిని చూసేందుకు వెళుతున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని రాత్రి షాహిద్ ఆఫ్రిది ట్వీట్ చేశాడు. కానీ విదిరాత మరోలా ఉంది. విషాద వార్త తెలియగానే షాహిద్ సహా అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇలా అవుతుందని అతను ఊహించలేదు. తిరిగి ఆమె కోరుకుంటుందని ఆశించాడు. అయితే ఈ వార్త తెలియగానే అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. అతని చెల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ…. ధైర్యంగా ఉండాలని ఆఫ్రిదీని కోరుతున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ గురించి తెలియని వారుండరు. పాక్ జట్టు దాదాపు 15 ఏళ్లు సేవలు అందించాడు. భారీ హిట్టర్ గా, ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పని చేశారు. ఇప్పుడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అల్లుడు.. షాహిన్ అఫ్రిదీ కూడా పాక్ జట్టులో కొనసాగుతున్నాడు.