ఇవాళ తెలంగాణలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తాజాగా హైదరాబాద్ లో పత్రికా ప్రకటన విడుదల చేసారూ. అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారు తెలంగాణలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారని ఈ అందర్బంగా వెల్లడించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.
అక్టోబరు 20 వ తేదీన అంటే ఇవాళ దుబ్బాకలో నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారు పాల్గొనున్నారు. అనంతరం రాత్రి 7 గం.లకు హైదరాబాద్ లోని అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో బిజెపి ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇక బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ఆడపడచులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామని వెల్లడించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.