ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించిన ఇజ్రాయెల్‌

-

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న వేళ వెంటనే కాల్పుల విరమణ పాటించాలన్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ తీర్మానాన్ని ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. తీర్మానం ఆమోదంపై ఐక్యరాజ్యసమితిలో.. ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి గిలాడ్ ఎర్డాన్ తీవ్రంగా స్పందించారు. మానవత్వానికి చీకటి రోజుగా అభివర్ణించారు. మరింత హింస జరగకూడదని కోరుకునే వారు ఎవరైనా సరే ఆయుధాలు వీడాలని, నేరం అంగీకరించాలని, బందీలను అందరినీ వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు సూచించాలని కోరారు. అది జరిగితే యుద్ధం వెంటనే ఆగిపోతుందని ఎర్డాన్ అన్నారు.

నాజీలు, ఐసిస్ పట్ల ప్రపంచం ఎలా వ్యవహరించిందో అలాగే తాము హమాస్‌ను అంతమొందించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్‌ చెప్పారు. ఐరాస సాధారణ అసెంబ్లీలో జోర్డాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి 120 దేశాలు మద్ధతు ఇవ్వగా . అమెరికా సహా 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, యూకే సహా 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. యుద్ధంవెంటనే ఆపాలని, పాలస్తీనా ప్రజలకు అవసరమైన సరుకులు పంపేలా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news