ఆంధ్ర‌ప్ర‌దేశ్ సైకో జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ ప్ర‌దేశ్‌గా మారిపోయింది – నారా లోకేష్

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సైకో జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ ప్ర‌దేశ్‌గా మారిపోయిందని నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి జరిగింది. విజయవాడ డిపో నకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తోంది. అయితే కావలిలోని ట్రంకు రోడ్డు లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంసింగ్ తన ముందున్న బైక్ అండ్ తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో అధ్యక్షత వాహనదారుడు బస్సు డ్రైవర్ తో వాదనకు దిగాడు. ఆ తర్వాత డ్రైవర్‌ పై దాడి చేశారు.

ఈ సంఘటనపై నారా లోకేష్‌ స్పందించారు. వైసీపీ అధినేత త‌న అవినీతి దందాల‌కు అడ్డొస్తున్నార‌ని సొంత బాబాయ్‌ని వేసేస్తే, ఆయ‌న సైకో ఫ్యాన్స్ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఫైర్‌ అయ్యారు. కావ‌లిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న వాహనం తీయాల‌ని ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ బీఆర్ సింగ్ హార‌న్ కొట్ట‌డ‌మే నేర‌మైందని మండిపడ్డారు. న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు వైకాపా నేత‌లు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సైకో జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ ప్ర‌దేశ్‌గా మారిపోయింది. సైకో జ‌గ‌న్ పోతేనే, ఇలాంటి పిల్ల సైకో గ్యాంగుల‌న్నీ పోతాయి. రాష్ట్రానికి ప‌ట్టిన పీడ విర‌గ‌డ‌వుతుందని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news