టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవర షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. దేవర సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయడానికి సినిమా బృందం ప్లాన్ లో ఉందట. అందుకు అనుగుణంగానే షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నారట. ఇందులో మొదటి పార్ట్ ను 2024 ఏప్రిల్ 5న అంటే వేసవి సెలవుల సంధర్భంగా రిలీజ్ చేయనుండగా, రెండవ పార్ట్ ను ఎప్పుడు విడుదల చేస్తారన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.
అయితే కొట్టాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలా షరావేగంగా షూటింగ్ కొనసాగిస్తోంది. ఈతరణంలోనే ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అక్కగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం మంచు లక్ష్మి గారిని కలిశారట. అంతేకాదు దేవరా సినిమాలో మంచు లక్ష్మి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా దేవర సినిమాలో జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.