కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే కేసీఆర్‌ పోటీ : కేటీఆర్‌

-

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఓవైపు పార్టీ అధినేత కేసీఆర్, మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభలు, బహిరంగ సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకర్షించే ప్రసంగాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు.  కామారెడ్డి జిల్లాలో రెండ్రోజుల నుంచి కార్యకర్తల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ అంతా కామారెడ్డి నియోజకవర్గం గురించే జరుగుతోందని అన్నారు.

ఎన్నో ఏళ్ల నుంచి గజ్వేల్ నుంచి పోటీ చేసే సీఎం కేసీఆర్.. ఈసారి కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారని రాష్ట్రమంతా చర్చించుకుంటోందని కేటీఆర్ అన్నారు. ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారంటే.. కామారెడ్డి రైతుల చిరకాల కల నెరవేర్చడానికేనని కేటీఆర్ అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఈనెల 9వ తేదీ కేసీఆర్ నామినేషన్ వేస్తారని చెప్పిన కేటీఆర్.. ఆరోజు కేసీఆర్ వెంట వచ్చే ప్రజలను చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందని అన్నారు. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడకుండా.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండని.. అది మాత్రమే కడుపు నింపుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news