తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారు : మంత్రి హరీశ్ రావు

-

జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి.. తెలంగాణ వద్దన్నాడు.. సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని అన్నాడు.. పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ.. వైఎస్‌ షర్మిలతో కాంగ్రెస్‌ చేతులు కలిపింది. తెలంగాణని వ్యతిరేకించిన వైఎస్ కూతురు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. లో లోపల చంద్రబాబు.. కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. తెలంగాణ ద్రోహులు అంతా ఒక్కటయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేకి అని హరీశ్ రావు పేర్కొన్నారు.

జగ్గారెడ్డి నాడు తెలంగాణ రానే రాదని అంటే.. కేసీఆర్‌ చావు నోట్లె తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ వచ్చినంక ప్రజల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైతే ఆసరా పెన్షన్ రూ.5 వేలకు పెరుగుతది. రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం ఇయ్యాలని కేసీఆర్‌ నిర్ణయించిండు. బీజేపోళ్లు రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1000కి పెంచిండ్రు. ఎన్నికల తర్వాత రాష్ట్రం ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తది. ఒకప్పుడు మహిళలు నీళ్లు మోసీమోసీ అవస్థలు పడ్డరు. ఇప్పుడు ఆ అవస్థలు లేవు. ఎన్నికలైనంక అర్హురాలైన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3000 భృతి ఇవ్వబోతున్నం’ అని మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news