నేను సీఎం రేసులో ఉన్నా – మరో కర్ణాటక మంత్రి ప్రకటన

-

తానూ సీఎం రేసులో ఉన్నానని కర్ణాటక హోమ్ మంత్రి జీ. పరమేశ్వర ప్రకటన చేశారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కొడుకు.. మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం రేసులో ఉన్నానని చేసిన ప్రకటన మరువక ముందే మరో మంత్రి సీఎం అవుతానని చేసిన ప్రకటన కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Karnataka Home Minister key statement

మంత్రి పరమేశ్వర ప్రకటనకు మద్దతుగా సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న నిన్న తుముకూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పరమేశ్వరకు సీఎం అయ్యే అదృష్టం కలుగుతుందని అతని అదృష్టానికి మేమందరం అండగా నిలుస్తామని ప్రకటించారు.

ఎన్నికైన 6 నెలలు పూర్తి కాకముందే కర్ణాటక కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్న తీరు ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ మారింది. ఇక అటు నిన్న కర్ణాటకలో సీఎం చైర్ కోసం సిద్దరామయ్య, డీకే శివ కుమార్ ఇద్దరూ కొట్టుకుంటుంటే వారిద్దరికీ కాకుండా పార్టీ నాకు అవకాశం ఇస్తే సీఎం చైర్ ఎక్కడానికి నేను సిద్దం అని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తన మనసులో మాట బైట పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news