కాళేశ్వరం వ్యవహారంలో.. బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది: రేవంత్‌రెడ్డి

-

కాళేశ్వరం వ్యవహారంలో కేంద్రం తెలంగాణ సర్కార్​పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల నష్టం జరిగినా.. ప్రజలకు ముప్పు పొంచి ఉన్నాయయ సీబీఐ విచారణకు ఎందుకు అదేశించట్లేదని నిలదీశారు. బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తోందని.. అందువల్లే కేసీఆర్​ను కేంద్రం కాపాడుతోందని ఆరోపించారు.

‘మరోవైపు ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివేదిక విడుదల చేయట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారుయ ప్రాజెక్టులో లోపాలపై సీఎం ఎందుకు వివరణ ఇవ్వట్లేదని నిలదీశారు. సంబంధిత కంపెనీపై ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని అడిగారు. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్టుల స్వరూపాన్ని కేసీఆర్‌ మార్చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు దోచుకున్నారన్న రేవంత్‌.. ప్లానింగ్‌, డిజైన్, క్వాలిటీ కంట్రోల్‌ను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదని.. డిజైన్ ప్రకారం నిర్మాణం, నిర్వహణ లేదని చెప్పారు. రూ.38,500 కోట్ల నుంచి రూ.లక్షా 51 వేల కోట్లకు అంచనాలు పెంచిందని.. నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news