తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని స్పష్టం చేసింది. అటు ఏపీలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తుఫాను ఆవర్తనం, అల్పపీడన ద్రోనీతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, మెదక్, సిరిసిల్లా, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.