దేశంలో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు అబాండాల వేయడం అలవాటు అయింది. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ప్రజలు గెలిచే రోజులు రావాలి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు మోసం చేసే మాటలు మాట్లాడుతున్నాయి.
ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. సింగరేణి ని మార్చేశాం.సింగరేణి 419 కోట్లు మాత్రమే ఉండేది. రూ.2184 కోట్లకు తీసుకెళ్లాం. సింగరేణిలో నూతన నియామకాల వ్లల యువతతో కళకళలాడుతుందని తెలిపారు సీఎం కేసీఆర్. కార్మికులు తీసుకునే వడ్డీ రుణానికి రూ.10లక్షలు వడ్డీలేని రుణం అందజేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. సింగరేణితో పాటు గోదావరి వద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నెంబర్ వన్ లో ఉన్నాం. సింగరేణి పరిధిలో 22వేల ఇండ్ల పట్టాలిచ్చామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి నడకనే మారిపోయింది. ఈసారి దసరా బోనస్ రూ.700 కోట్లు ఇచ్చామని తెలిపారు సీఎం కేసీఆర్.