World Cup 2023 : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రత్యేకంగా సత్కరించింది. ‘హ్యాపీ బర్త్డే విరాట్’ అని రాసిన బంగారు పూత బ్యాట్ ను CAB ప్రెసిడెంట్ స్నేహశిశ్ గంగూలి కోహ్లీకి బహుకరించారు. అలాగే ‘వయస్సు కేవలం ఒక సంఖ్య. దీనికి సజీవ సాక్ష్యం మీరే’ అన్న అక్షరాలను కూడా బ్యాట్ పై ముద్రించారు.
అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను CAB ప్రతినిధులు కోహ్లీ చేత కట్ చేయించారు. ఇది ఇలా ఉండగా… వరల్డ్ కప్ లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. టీమిండియా తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్లో 243 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 327 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు 83 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టారు. శమి, కుల్దీప్ చరో 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.