Virat Kohli : అనుష్క పాటకు కోహ్లీ స్టెప్పులు…వీడియో వైరల్

-

Virat Kohli : అనుష్క పాటకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశాడు. సాధారణంగా మైదానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన స్టైల్ లో ఫన్ చేస్తుంటారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాదిన విరాట్ ఫీల్డింగ్ సమయంలో సరదాగా కనిపించారు.

Virat Kohli dances to Anushka Sharma’s ‘Ainvayi Ainvayi’ Song during IND vs SA 2023 World Cup clash

మ్యాచ్ మధ్యలో తన భార్య అనుష్క శర్మ నటించిన ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రంలోని ‘ఐన్వాయి ఐన్వాయి’ పాటకు స్టెప్పులతో అలరించారు. మరో పాటలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను అనుకరిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ,  విరాట్ కోహ్లీని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రత్యేకంగా సత్కరించింది. ‘హ్యాపీ బర్త్డే విరాట్’ అని రాసిన బంగారు పూత బ్యాట్ ను CAB ప్రెసిడెంట్ స్నేహశిశ్ గంగూలి కోహ్లీకి బహుకరించారు. అలాగే ‘వయస్సు కేవలం ఒక సంఖ్య. దీనికి సజీవ సాక్ష్యం మీరే’ అన్న అక్షరాలను కూడా బ్యాట్ పై ముద్రించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news