ప్రజల కోసమే తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని టీడీపీ అధ్యక్షురాలు వైసీపీ షర్మిల పేర్కొన్నారు. ఎవరోతమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు షర్మిల. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కేసు కొట్టేసేందుకు సుప్రీకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలి అన్నారు. అన్ని పార్టీల్లో దొంగలు ఉంటారని.. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తో సంబంధం లేదని గతంలో సజ్జల అన్నారని..ఇప్పుడు ఏం సంబంధం ఉందని తన గురించి ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు సజ్జల గారు.. ముందు మీ కథ మీరు చూసుకోండి అని షర్మిల ఎద్దేవా చేశారు.