మోదీ పర్యటన దృష్ట్యా.. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్​లో నేడు పలు చోట్ల అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నగరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన, స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎల్బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు. మోదీ పర్యటన దృష్ట్యా ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుని మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు  ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగ సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే నాయకులు, అభిమానులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు జాయింట్ సిపిలు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు సహా 25 మంది డీఎస్పీ, 65 మంది సీఐలు, 114 మంది ఎస్​ఐలతోపాటు ఇతర సిబ్బంది. 2 క్విక్‌ రెస్పాన్స్ టీమ్స్, 18 ప్లటూన్ల అదనపు బలగాలు విధుల్లో ఉండనున్నట్లు వెల్లడించారు. వారితో పాటు  మరో 300 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news