ఆపిల్‌ నుండి 16 ఇంచుల మ్యాక్‌బుక్‌ ప్రొ

-

టెక్‌ రంగంవారు ఎప్పటినుండో ఊహిస్తున్న 16 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రొను ఆపిల్‌ విడుదల చేసింది. ప్రపంచంలోనే గొప్ప ప్రొ బుక్‌గా అభివర్ణించబడిన ఈ మ్యాక్‌బుక్‌ అదిరిపోయే ప్రత్యేకతలతో మార్కెట్‌ ప్రవేశం చేయనుంది.

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 16 ఇంచుల నూతన మ్యాక్‌బుక్ ప్రొను విడుదలచేసింది. ఇందులో 16 ఇంచుల ఐపీఎస్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7/కోర్ఐ9 9వ తరం ప్రాసెసర్, 64జీబీ వరకు ర్యామ్, 8టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, ఏఎండీ రేడియాన్ ప్రొ 5500ఎం 4జీబీ గ్రాఫిక్స్/ఇంటెల్ అల్ట్రా హెచ్‌డీగ్రాఫిక్స్ 630, టచ్‌బార్ కీబోర్డ్, టచ్ ఐడీ, బ్లూటూత్ 5.0, హెచ్‌డీ వెబ్కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, 100వాట్ అవర్ బ్యాటరీ, మ్యాక్‌ఓఎస్ కాటలినా ఆపరేటింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

మొదటిసారిగా ఈ మ్యాక్‌బుక్‌లో సిజర్‌ మెకానిజమ్‌ కీబోర్డ్‌ను వాడారు. ఇంతకుముందు వరకు ఉన్న బటర్‌ఫ్లై కీబోర్డ్‌పై సర్వత్రా విమర్శలను ఎదుర్కొన్న ఆపిల్‌ ఆ పొరపాటును ఇందులో సరిదిద్దుకుంది.

వృత్తినిపుణులను, ఫోటోగ్రాఫర్లను, డిజైనర్లను, విడియో ఎడిటర్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని తయారుచేసారు. దాదాపు ఐమ్యాక్‌లో చేయగలిగే చాలా పనులను చేసే సత్తా దీనికి ఉందని ఆపిల్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. సిల్వర్‌, స్పేస్‌గ్రే రంగులలో లభించబోయే ఈమ్యాక్‌బుక్ ప్రొ ప్రారంభ ధర భారత్‌లో రూ.1,99,900గా ప్రకటించినా, ఎప్పటినుండి మార్కెట్లోకి వస్తుందనేది ఇంకా చెప్పలేదు. అమెరికాలో మాత్రం ఈ వారం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news