రాజకీయంగా తనదైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతిని ఎంత మాత్రం సహించబోనని పదే పదే చెబుతున్నారు. ఈ విషయంలో మంత్రులకు వార్నింగ్ ఇవ్వడానికి సైతం జగన్ ఏ మాత్రం మోహమాటపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. వైఎస్ జగన్ నలుగురి మంత్రుల పని తీరుపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ సంక్రాంతి తర్వాత కేబినెట్ మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు యువ మంత్రుల్లో కూడా ఇద్దరికీ ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక దీనిపై ప్రస్తుతం పార్టీ అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారట. అలాగే జగన్ కొత్త వారిని కేబినెట్ లో తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు కీలక శాఖలకు సీనియర్లతో పాటు మరో మహిళను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.