వరల్డ్ కప్ లో మళ్ళీ విఫలం అయిన ఇంగ్లాండ్ కెప్టెన్ !

-

ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ అంత దారుణంగా ఎవ్వరూ ఆడలేదన్న పేరును సార్ధకం చేసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రకారం పాయింట్ల పట్టికలో 7 మ్యాచ్ లు ఆడిన తర్వాత ఆఖరి స్థానంలో ఉంది. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ మరియు కీపర్ అయిన జాస్ బట్లర్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఎందుకంటే ఏ జట్టు అయినా సక్సెస్ అవ్వాలంటే కెప్టెన్ నాయకత్వంలోనూ మరియు ఆటలోనూ ముందుండి నడిపించాలి. కానీ బట్లర్ ఇందులో పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. 7 మ్యాచ్ లలోనూ విఫలం అయిన బట్లర్ ఈ రోజు కూడా 11 బంతులను ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలా ఈ సీజన్ మొత్తం బట్లర్ కు మరిచిపోలేనిది చెప్పాలి. మరి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో అయినా గెలుస్తుందా చూడాలి.

ఎలాగు సెమీస్ కు చేరకుండానే ఇంటి బాట పడుతున్న తరుణంలో 2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి అయినా అర్హత సాధిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news