నెదర్లాండ్ ముందు భారీ లక్ష్యం… అంతా అయిపోయాక స్టోక్స్ సెంచరీ !

-

ఈ రోజు పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు నెదర్లాండ్ లు తలపడుతున్న విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్ లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఈ స్కోర్ ఇంగ్లాడ్ కు రావడంలో కీలక పాత్ర పోషించిన వారిలో బెన్ స్టోక్స్ (108), మలన్ (87) మరియు క్రిస్ వోక్స్ (51) లు ఉన్నారు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ మరియు మలన్ లు అడపాదడపా రాణిస్తున్నా, వీరికి వేరే ఆటగాళ్ల నుండి సరైన సహకారం అందకపోవడం వల్లనే వరల్డ్ కప్ లో ఇలాంటి ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఒక డిపెండింగ్ ఛాంపియన్ అయి ఉండి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించి ఉండరేమో ? అందుకే ఈ స్కోర్ ను చూసి ఎవ్వరూ సంతోషపడకపోవచ్చు.. అంతా అయిపోయాక భారీ స్కోర్లు చేసి ఏమి లాభం అంటూ కామెంట్ లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక ఈ మ్యాచ్ లో బెయిర్ స్టో (15), రూట్ (28),బ్రూక్ (11), అలీ (4) లు విఫలం అయ్యారు. మరి నెదర్లాండ్ ను అయినా తక్కువ స్కోర్ కు ఆల్ అవుట్ చేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news