హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

-

హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్ జామ్ చాలా కామన్. అయితే మెట్రో, ఫూట్ ఓవర్, ఫ్లై ఓవర్, స్కై వాక్​ల పుణ్యమా అని ట్రాఫిక్ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా మెట్రో పనులు, ఫ్లై ఓవర్ల పనులు జరుగుతుండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ మార్గాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్​ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో హైవే విస్తరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయిందని అధికారులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి సుమారు 5కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయని వెల్లడించారు. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్​ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news