ఉత్తర గాజాపై పట్టుకోల్పోయిన హమాస్‌.. ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటన

-

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇంకా ఉద్రిత్తంగా యుద్ధం సాగుతూనే ఉంది. హమాస్​ను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్​ గాజాపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సామాన్య పౌరులు, ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలు, సొరంగాలు ఇలా.. ప్రతిచోటా వైమానిక దాడులు.. భూతల దాడులతో ఆ ప్రాంతంలో మారణ హోమం సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో వేలమంది సామాన్య పౌరులు మరణిస్తున్నారు. ఈ క్రమంలో గాజాను రెండు భాగాలుగా(ఉత్తర గాజా, దక్షిణ గాజా)గా విభజించి దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఉత్తర గాజాపై హమాస్‌ మిలిటెంట్లు పట్టు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఉత్తర గాజాలో హమాస్‌ పట్టు కోల్పోయిన విషయం అక్కడి ప్రజలకు అర్థమైందనియ. అందుకే వారు దక్షిణ భాగానికి వలస వెళ్తున్నారని ఇజ్రాయెల్‌ మిలటరీ అధికార ప్రతినిధి రేర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి అన్నారు. గాజాలో కాల్పులు విరమించేది లేదని.. అయితే, ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లేందుకు వీలుగా నిర్ణీత సమయాల్లో విరామం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news