అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ రేపు భారత్‌లో పర్యటించనున్నారు. భారత్-అమెరికా 2+2 మినిస్టీరియల్ చర్చల సందర్భంగా బ్లింకెన్.. ఆ దేశరక్షణ కార్యదర్శి లాయిడ్ జే ఆస్టిన్‌తో కలిసి భారత్‌కు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ తమకు దృఢమైన భాగస్వామి అని ఈ సందర్భంగా అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య భద్రతా సహకార అభివృద్ధి.. ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యాల్లో ఒకటని పేర్కొన్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాధాన్యాలపై పరస్పర సహకారం, ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చలు జరగనున్నాయని తెలిపాయి. మిలిటరీ హార్డ్‌వేర్ ఒప్పందాలపై.. US దృష్టి సారించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 3 వందల కోట్ల డాలర్ల విలువైన 31 MQ 9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదరగా.. అదనంగా ఆరు P-8 నిఘా విమానాలను కొనాలని అమెరికా కోరనుందని సమాచారం. స్వదేశీ ఆయుధ తయారీ కోసం అధునాతన సాంకేతికతను ఇవ్వాలని భారత్ కోరే అవకాశం ఉంది.