టాలీవుడ్ దర్శకుడు, టిడిపి మద్దతుదారుడు రాఘవేంద్రరావుకు ఊహించని షాక్ తగిలింది. సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తా అని చెప్పి తక్కువ రేట్లకు భూమి కొట్టేసి అందులో ఇప్పుడు జూదం, బార్లు, మద్యం వ్యాపారం చేస్తున్నాడని టాలీవుడ్ దర్శకుడు, టిడిపి మద్దతుదారుడు రాఘవేంద్రరావుపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి చంద్రబాబు ప్రభుత్వం కారు చవకగా రాఘవేంద్రరావుకు కట్టబెట్టేసిందని ఆరోపణ ఉంది. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని తీసుకున్న పనికి కాకుండా గ్యాం బ్లింగ్ , మద్యం వ్యాపారాలకు వాడుతున్నారు అంటూ ఒక సాధారణ వ్యక్తి బాలకిషన్ 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇన్ డ్లో భాగం గానే రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.