త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామం ప్రకటి0చారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లాల్లోని షామిర్ పెట్ లో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో హరిహ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన గిరిజన ప్రజాప్రతినిధులకు పేరు పేరున అభినందనలు అన్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు.కేసీఆర్ కు ముందు….కేసీఆర్ కు తరువాత అని ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయండి… కేసీఆర్ కు ముందు తాండల పరిస్థితి ఏంది.ఇప్పుడు ఏంది అని ప్రశ్నించారు.
ఆనాడు తాగు నీళ్ల కోసం ఎంత కష్టపడ్డారో చూడండని కోరారు. నారాయణ ఖేడ్ లో బిందలతో ఎన్నో పోరాటాలు…ఆనాడు మంచం ఎక్కిన తండా….విష జ్వరాలతో గిరిజన గుడాలు అని పేపర్ లలో హెడ్డింగ్లు అంటూ గుర్తు చేశారు. ఇవాళ తాగు నీరు కష్టాలు లేవు….మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్నామని చెప్పారు.2009 లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది తాండలను గ్రామ పంచాయతీ లు చేస్తాం అని చేసిందా …..లేదు… కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత అన్ని తాండలను గ్రామ పంచాయతీ లు చేశారన్నారు. ఆనాడు తాండలను గ్రామ పంచాయతీ లు చేయాలని ఎన్నో పోరాటాలు…ఎన్నో ఉద్యమాలు.నేను కూడా తాండలను గ్రామ పంచాయతీ లు చెయాలని ఆనాడు పోరాటంలో పాల్గొన్నానని చెప్పారు.