తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ములుగులో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. నామినేషన్ చివరి రోజు వరకు ములుగు పార్టీ టికెట్ రేసులో ఉన్న తాటి కృష్ణయ్య బిజెపికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కన్నీటి పర్యాంతం అయ్యారు.

ములుగు నియోజకవర్గంలో నాలుగేళ్లుగా బిజెపితో మమేకమై జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు వేసి అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు సవాల్ గా బిజెపి క్యాడర్ ను సిద్ధం చేశారన్నారు. టికెట్ల కేటాయింపులో కూడా బీజేపీని బలోపేతానికి లక్షల రూపాయలు అప్పు చేసి చివరివరకు తమకు నాయకత్వం ఇస్తానని నమ్మి నాయకులు, కార్యకర్తలను తన పక్షాన ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో బిజెపిని బలోపేతం చేసేందుకు రాష్ట్రస్థాయి పదవి ఇచ్చిన పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ చివరకు గొంతు కోసుకున్నారు.