రేవంత్ నీకు మైండ్ ఉందా.. 3 గంటల్లో 3 ఎకరాలు ఎలా పారుతుంది ? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా? వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంట్ అవసరమో రేవంత్ తెలియదన్నారు. మూడు గంటల్లో మూడు ఎకరాలు ఎలా పారుతుంది రేవంత్ ? రైతుల జీవితాలతో కాంగ్రెస్ అటలాడుకోవాలని అనుకుంటుందని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ వస్తె కరెంట్ బాధలు…కర్ఫ్యూ బాధలు వస్తాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు బంద్ అయ్యిందట అంటూ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అంటే నమ్మకం …చెప్పినవి అని అమలు చేశారని కొనియాడారు. తెలంగాణ బండి సేఫ్ నడుస్తుంది…ఎందుకు రిస్క్ తీసుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మూర్ఖులు…రైతులు అంటే గిట్టదు…ఏ రైతు అయిన కాంగ్రెస్ ఎందుకు ఓటు వేయాలని ఆలోచించుకోవాలని కోరారు. మాజీ సిఎం కుమార స్వామి కర్ణాటకలో రెండు గంటల కరెంట్ రావడం లేదని అంటున్నారని గుర్తు చేశారు.