అయోధ్య దీపోత్సవ్ అద్భుతం.. ఫొటోలు షేర్ చేసిన మోదీ

-

దీపావళి పండుగను దేశప్రజలంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆదివారం రోజున భారతదేశమంతా దీపకాంతలా దేదీప్యమానంగా వెలిగిపోయింది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ఎప్పటిలాగే కాంతులు విరాజిల్లింది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి దీపావళికి అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం దీపోత్సవ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది.

ఇక్కడి సరయూ నది తీరంలో దీపోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఒకేసారి 22 లక్షల 23వేల దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అయోధ్య దీపోత్సవం.. అద్భుతం.. ఇది ఒక మరపురాని వేడుక అంటూ మోదీ తన క్యాప్షన్ లో అభివర్ణించారు.

‘అయోధ్యలో  ‘దీపోత్సవం’లో భాగంగా వెలిగించిన లక్షలాది దీపాలతో దేశమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఈ శక్తి దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని పంచుతోంది. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ మేలు చేయాలని, కుటుంబ సభ్యులందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news