హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

-

BREAKING : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ పార్టీ నేతల కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికారు.

Union Home Minister Amit Shah reached Hyderabad
Union Home Minister Amit Shah reached Hyderabad

ఇక తెలంగాణ పర్యటన నేపథ్యంలో గద్వాల, నల్గొండ, వరంగల్ బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలలో పాల్గొననున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌ షా.. ఆ తర్వాత ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశంలో పాల్గొననున్నారు.

ఎన్నికల ప్రణాళిక విడుదల అనంతరం సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో సమావేశంకానున్నారు. సమావేశం అనంతరం రాత్రి 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణంకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news