జోగులాంబ అమ్మవారి స్థలానికి రావడం నా అదృష్టం : అమిత్ షా

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. శక్తి పీఠం అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి స్థలానికి రావడం తన అదృష్టమని తెలిపారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించిందని చెప్పారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్‌ రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. కేసీఆర్‌ ఇస్తానన్న రూ. 100 కోట్లు ఇవ్వకపోగా మోదీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.

“ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్​కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైంది. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ రికార్డు సృష్టించారు. గుర్రంగడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదు. గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చేయలేదు. కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదు. గద్వాలలో చేనేతల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు నిర్మించలేదు. గద్వాలలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు.” అని అమిత్ షా ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news