ఆర్టీసీ విషయంలో బీజేపీ ఊహించింది జరగలేదా…? కెసిఆర్ ని తక్కువ అంచనా వేసి తప్పు చేసిందా…?

-

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తీవ్ర స్థాయిలో జరుగుతుంది… రాజకీయంగా ఇది తెరాస పార్టీకి ఇబ్బందికర వాతావరణమే అని భావించారు అందరూ… హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుంది అనే వ్యాఖ్యలు కూడా కొన్ని రోజుల క్రితం చేశారు. ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయం చూసిన తర్వాత వాళ్ళు చేసిన వ్యాఖ్య… “ప్రజల్లోకి ఆర్టీసీ ఉద్యమం వెళ్ళలేదు అని” అందుకే తెరాస ఆ స్థాయిలో విజయం సాధించింది అని… 40 వేలతో విజయం సాధించిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందీ అని ఆరోపించిన వాళ్ళు కూడా దాదాపుగా సైలెంట్ అయ్యారు.

అప్పటి వరకు రాజకీయంగా తలదూర్చిన గవర్నర్ గారు ఆ తర్వాత దాదాపుగా సైలెంట్ అయ్యారు. విద్యాసంస్థల్లో ప్రక్షాళన, క్యాబ్ డ్రైవర్ల సమ్మె, ఆర్టీసీ జేఏసీ తో సమావేశాలు నిర్వహించడం వంటివి అప్పటి వరకు చేసిన తమిళ సై గారు ఆ తర్వాత దూకుడుగా వెళ్ళలేదు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పుడు అవేమి జరగడం లేదు… వాస్తవానికి గవర్నర్ ని నడిపించేది కేంద్రం… ఈ సమస్య విషయంలో తాము తలదూర్చి ప్రయోజనం పొందుదాం అని కేంద్రం చూసింది… కానీ అలా జరగలేదు…

ఏ విషయంలో అయినా సరే అలసత్వం ప్రదర్శించే కెసిఆర్… తనకు ముప్పు వస్తుంది అంటే మాత్రం ముందే పసిగట్టే ప్రయత్నం చేస్తారు… అందుకే ఇక్కడ బీజేపీ పప్పులు ఏమీ ఉడకలేదు అనేది కొందరి వ్యాఖ్య. రాజకీయంగా కెసిఆర్ ని బీజేపీ తక్కువ అంచనా వేసింది ఆర్టీసీ విషయంలో అనేది అన్ని పరిణామాలు చూసిన తర్వాత స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు సమస్య తీవ్రత ఎలా ఉన్నా సరే కెసిఆర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు… చివరికి జేఏసీ నే వెనక్కు తగ్గి కీలక డిమాండ్ ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. చివరిగా అర్ధమయ్యేది ఒకటే… రాజకీయంగా ఆర్టీసీ సమ్మెను వాడుకుందామని చూసిన భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం కూడా ప్రయోజనం కలగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news