NTR : ‘దేవర’లో మరో బాలీవుడ్ హీరో?

-

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్నభారీ యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నవిషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కీలక సన్నివేశాలను పూర్తి చేస్తూ వస్తున్నారు.

 

Another Bollywood hero in Devara
Another Bollywood hero in Devara

అయితే..Jr.NTR, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా, జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్-1 2024, ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news