Sanju Samson: సంజూపై మరోసారి వేటు..బీసీసీఐపై విమర్శలు

-

 

వరల్డ్ కప్ ఓటమి తర్వాత మరో పోరాటానికి సిద్ధమైంది టీమిండియా. వరల్డ్ కప్ ఓటమిని పూర్తిగా మర్చిపోకముందే ఆసీస్ తో టి20 సిరీస్ కు టీమిండియా రెడీ అయిపోయింది. ఈ సిరీస్ లో సీనియర్ ప్లేయర్లు అందరికీ విశ్రాంతి ఇచ్చిన టీం మేనేజ్మెంట్ కుర్రాళ్ళతో కూడిన జట్టును బరిలోకి దింపుతోంది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. వీరిలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది.

Netizens Shattered As Selectors Drop Samson For Australia T20I Series
Netizens Shattered As Selectors Drop Samson For Australia T20I Series

వరల్డ్ కప్ జట్టులో ఉన్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. వాళ్లే సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ద్ కృష్ణ. హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్ గా వరల్డ్ కప్ జట్టులోకి ప్రసిద్ద్ కృష్ణ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సంజు శాంసన్ కు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. తాజాగా ఆస్ట్రేలియాతో టి 20 సిరీస్ కు జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ అతడికి చోటు కల్పించలేదు. ఆసియా కప్, ఏసియన్ గేమ్స్, వరల్డ్ కప్ లోను సెలెక్టర్లు అతడిని పరిగణలోకే తీసుకోలేదు. ఇప్పుడు ఆసీస్ తో టి20 సిరీస్ కు అంతా కుర్రాళ్లనే ఎంపిక చేసిన బీసీసీఐ…. సంజుకు మాత్రం ఛాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో సంజు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news