Suriya : షూటింగ్ లో హీరో సూర్యకు గాయాలు..

-

Suriya : తమిళ్‌ హీరో సూర్యకు ఊహించని పరిణామం ఎదురైంది. తమిళ హీరో సూర్యకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.

Hero Suriya injured in shooting
Hero Suriya injured in shooting

సూర్య ప్రస్తుతం “కంగువ” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా కెమెరా ఆయన మీద పడిందని సమాచారం. కెమెరా మీద పడడంతో సూర్య భుజానికి గాయం అయింది.

కాగా, సూర్య ‘కంగువా’ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news